తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన రద్దు
తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు, కాకరవాయి గ్రామాల్లో ఈరోజు జరగాల్సిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దయినట్లు కాంగ్రెస్ నాయకులు రామసహాయం నరేశ్ రెడ్డి తెలిపారు. తదుపరి పర్యటన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.