పెనుబల్లి: సత్తుపల్లి, అశ్వారావుపేటలో నిరుపేదలకు 5 వేల ఉచిత ఇళ్లు: మంత్రి పొంగులేటి ప్రకటన
సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో తాన్లా ఫౌండేషన్ సహకారంతో రూ.300 కోట్లతో 5 వేల ఉచిత ఇళ్లను నిర్మిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గంగారంలో కొత్తగా నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రం, ల్యాబొరేటరీని ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రారంభించారు.