ఖమ్మం అర్బన్: ఖమ్మం మున్నేరు చెక్‌డ్యామ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహకల్ప సమీపంలోని మున్నేరు చెక్‌డ్యామ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 50-55 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు ఖమ్మం రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు.