కూసుమంచి: కూసుమంచిలో బస్టాండ్ కోసం అఖిలపక్షం సంతకాల సేకరణ
కూసుమంచిలో బస్టాండ్ నిర్మించాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. గర్భిణులు, వృద్ధులు, విద్యార్థుల సౌకర్యార్థం ఈ బస్టాండ్ అవసరమని, సేకరించిన సంతకాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లకు అందజేస్తామని టీడబ్ల్యూఎంఎఫ్ జిల్లా ఇన్చార్జి ఉపేందర్‌రెడ్డి తెలిపారు.