కూసుమంచి: పాలేరులో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటన
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.