ధర్పల్లి: నిజామాబాద్: కరెంటు కోతలకు నిరసనగా రైతుల ధర్నా
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. సాగునీరు అందించే సమయంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.