కొత్తగూడెం: ములుకలపల్లిలో గిరిజన వృద్ధ దంపతులపై దాడి: న్యాయం కోసం గిరిజన నాయకుల డిమాండ్
ములుకలపల్లి సుందరయ్య నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇంటిని నిర్మిస్తున్న గిరిజన వృద్ధ దంపతులపై స్థల వివాదంలో దాడి జరిగింది. బాధితులను, వారిని రక్షించబోయిన స్థానికులను కులం పేరుతో దూషించి గాయపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక గిరిజన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.