మహబూబాబాద్: మిషన్ భగీరథ కార్యాలయం ముందు సిపిఐ నిరసన
మహబూబాబాద్‌లో నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో సిపిఐ కౌన్సిలర్లు ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలిపారు. పనుల్లో జాప్యం, నీటి సరఫరాలో అంతరాయాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.