నందిపేట: నందిపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు!
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లిలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. జిల్లాలో 17 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు ఉండటంతో, ఫ్యాక్టరీ ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు సోయా, రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమలపైనా దృష్టి సారించారు.