కొత్తగూడెం: గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ హైదరాబాద్ వారి కమిషనర్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, వసతిగృహాలలలో పనిచేయుచున్న సి ఆర్ టి టీచర్లను బదిలీలు చేయడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు.
మంగళవారం నాడు ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరములో గిరిజన సంక్షేమ శాఖ అధికారుల అబ్జర్వర్ కమిటీ సభ్యుల సమక్షంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో పనిచేయుచున్న సిఆర్టి టీచర్లను కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ బదిలీల ప్రక్రియలో భార్యాభర్తలు, వికలాంగులు మరియు మెడికల్ పరంగా, వితంతు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగిందని అన్నారు. అందులో సబ్జెక్టుల వారిగా తెలుగు-06, గణితం -12,ఇంగ్లీష్-09, ఫిజిక్స్ -09, బయో సైన్స్ -09, సాంఘిక శాస్త్రం -08, ఎస్ జి టి -06, పిడి -01, పీ ఈ టి-01, ఎల్ పి టి -01 మొత్తం 67 మందిని కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేశామని ఆయన అన్నారు.
ఈ బదిలీల ప్రక్రియ ఎటువంటి అవకతవకలకు తావులేకుండ టీచర్లు అందరూ సంతృప్తి చెందేలా బదిలీలు చేయడం జరిగిందని ఆయన అన్నారు.
కార్యక్రమంలో ఖమ్మం డిడి ట్రైబల్ వెల్ఫేర్ ఫిరంగి, ఏసీఎమ్ఓ రాములు, ఏటీడీవో రమేష్ మరియు కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.