దంతాలపల్లి: మహబూబాబాద్: దంతాలపల్లిలో అక్రమ గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద ముప్పారం, వాళ్య తండాలో పోలీసులు అక్రమ గుడుంబా స్థావరాలపై రైడ్స్ నిర్వహించారు. భారీగా బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.