మహబూబాబాద్: ఎస్ఐఆర్-2026: ఓటర్లకు సీఈఓ కీలక ఆదేశాలు.. ఇక ఇంటికే రానున్న బీఎల్ఓలు!
ఎస్ఐఆర్-2026 ప్రక్రియలో భాగంగా ఓటర్లను కార్యాలయాలకు పిలిపించవద్దని, బీఎల్ఓలే నేరుగా ఇంటికి వెళ్లి నోటీసులు అందజేయాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అత్యవసర విచారణలు ఆన్లైన్లో నిర్వహించాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.