మహబూబాబాద్: మహబూబాబాద్ మున్నేరు వాగు వద్ద బతుకమ్మ ఘాట్, స్మశాన వాటిక ఏర్పాటుకు సీపీఎం డిమాండ్
మహబూబాబాద్ మున్నేరు వాగు వద్ద శాశ్వత బతుకమ్మ ఘాట్, ఆధునిక స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు సీపీఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. కనీస వసతులు కల్పించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.