కొత్తగూడెం: పినపాకలో వలస ఆదివాసీల సమస్యలను విన్న ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యే విక్రమ్ మడివి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని వలస ఆదివాసీ గ్రామాల్లో ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మడివి పర్యటించారు. పోడు భూముల పట్టాలు, కుల ధ్రువీకరణ పత్రాల సమస్యలపై గిరిజనులతో చర్చించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.