కొత్తగూడెం: పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
*డాగ్ కెన్నెల్, బీడీ టీమ్ సదుపాయాల ఏర్పాటుకు పనులు వేగవంతం చేయాలి*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సోమవారం నాడు సందర్శించారు. హెడ్‌క్వార్టర్స్‌లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి, మరమ్మతుల పనులను పరిశీలించారు.
డాగ్ కెన్నెల్, బీడీ టీమ్‌లను పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటు చేయటం కోసం అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టి పనులను వెంటనే ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అదేవిధంగా హెడ్‌క్వార్టర్స్‌లో అవసరమైన ఇతర మరమ్మతులు, మౌలిక సదుపాయాల పనులను కూడా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఎంటీఓ సుధాకర్, ఆర్ఐ అడ్మిన్ లాల్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.