గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లాలో విషాదం: బెట్టింగ్‌లో రూ. 9 లక్షలు పోగొట్టుకుని యువకుడు ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లిలో ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై శ్రీకాంత్ (23) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌లో రూ. 9 లక్షలు నష్టపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.