ఆందోల్: తుది దశకు చేరుకున్న కోడూర్ - కొండారెడ్డిపల్లి రోడ్డు పనులు
ఆందోల్ మండలం కొండారెడ్డిపల్లి నుంచి పుల్కల్ మండలం కోడూర్ వరకు 6.70 కి.మీ రోడ్డు నిర్మాణం తుది దశలో ఉంది. మంత్రి దామోదర రాజనర్సింహ కృషితో 4.69 కోట్ల నిధులతో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.