కొత్తగూడెం: సీతారాంపురం తండాలో భూ వివాదం: వృద్ధ దంపతులపై దాడి
లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం తండాలో భూ వివాదం కారణంగా భావ్సంగ్ దంపతులపై ప్రత్యర్థి వర్గం దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ అఖిల ఆధ్వర్యంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.