నస్పూర్: మంచిర్యాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
మంచిర్యాల సీసీసీ కార్నర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గౌతమి, సురక్ష మరియు యశోద హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకోతో పాటు పలు పరీక్షలను ప్రజలకు ఉచితంగా అందించారు.