కొణిజర్ల: ఖమ్మం: చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష, రూ. 12.70 లక్షల జరిమానా
చింతకాని మండలం రాఘవాపురానికి చెందిన సిమ్మసర్తి వీరబాబుకు ఖమ్మం కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. 2020లో రూ. 10 లక్షలు అప్పుగా తీసుకుని, 2022లో ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది. జైలుశిక్షతో పాటు రూ. 12.70 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.