పెనుబల్లి: సత్తుపల్లిలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాగమయి
ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. చిన్న కోరుకొండి, పెద్ద కోరుకొండి, చెన్నూరు, ఎర్రబోయినపల్లి గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.