కొత్తగూడెం: వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించిన అధికారులను సిబ్బందిని ప్రశంసించిన భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల శ్రేష్ట
తొమ్మిది రోజులపాటు వినాయక నవరాత్రులు జరుపుకొని భద్రాచలంలోని గోదావరిలో నిమజ్జనానికి వివిధ జిల్లాల నుండి వచ్చిన వినాయక ప్రతిమలు భక్తులకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత సిబ్బంది తగ జాగ్రత్తలు తీసుకొని వినాయక నిమజ్జనం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశారని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ట మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
వినాయక చవితి పండుగ ప్రారంభమైన మూడవ రోజు నుండి గోదావరి కరకట్ట ప్రదేశాలలో నిమజ్జనానికి వినాయక ప్రతిమలను భక్తులు తీసుకొని రావడం జరిగిందని అలాగే పక్క జిల్లాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భద్రాచలం గోదావరిలో వినాయక ప్రతిమలు నిమజ్జనం చేయడానికి రావడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు మరియు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం సహాయంతో భక్త మండల్ లకు ఇబ్బందులు కలగకుండా నిమజ్జనం చేయడం జరిగిందని, 20 అడుగుల పైన ఉన్న వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని, విగ్రహాలను క్రేన్ సహాయంతో తీసేటప్పుడు భక్తులు గాని చూడడానికి వచ్చే ప్రజలు గాని ఎవరూ ఉండకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని వారి వాహనాలలో నుంచి తీసి మెల్లగా గోదావరిలో నిమజ్జనం చేయడం జరిగిందని అన్నారు.
వినాయక భక్తమండలి సభ్యులు అధికారుల సూచనలను పాటించి అతి భారీ వినాయక ప్రతిమలను సురక్షితంగా నిమజ్జనం చేసే విధంగా అధికారులకు సహకరించారని అన్నారు.
గోదావరి కరకట్ట ప్రదేశాలలో నిమజ్జన కార్యక్రమానికి పగడబందీగా విధులు నిర్వహించిన ఐటీసీ డిప్యూటీ జిఎం చంగల్ రావు, భద్రాచలం తాసిల్దార్ రామ్ కుమార్, ఏ డి ఎం హెచ్ ఓ సైదులు, ఇరిగేషన్ ఈ ఈ రాంప్రసాద్, ఎం వి ఐ వెంకట పుల్లయ్య, జిపిఈఓ శ్రీనివాస్, ఎన్ డి ఆర్ ఎఫ్, విద్యుత్ మత్స్యశాఖ ఎస్ సి సి ఎల్, అగ్నిమాపక, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు మరియు వారి బృందానికి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు.