కొత్తగూడెం: రూ.1.82 కోట్ల గంజాయి పట్టివేత..
365 కేజీల గంజాయి స్వాధీనం.
లారీ కారు బైక్ స్వాధీనం.
ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.
ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు మూడు వాహనాల్లో తరలి వెళ్తున్న గంజాయిని ఖమ్మం జిల్లా భద్రాచలం డిటిఎఫ్ ఇతర ఎక్సైజ్ టీములు కలిసి పట్టుకున్నారు.
ఈ మూడు వాహనాల్లో 365 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పట్టుకున్న గంజాయి విలువ రూ. 1.82 కోట్లుగా ఉంటుందని ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు.
కేసు వివరాల్లోకి వెళితే..
భద్రాచలం వీరభద్ర ఫంక్షన్ హాల్ సమీపంలో డిటిఎఫ్ కొత్తగూడెం టీం తనిఖీలు నిర్వహించారు.
ఈ తన్కీలో తొలతగా బైక్ పై వస్తున్న వ్యక్తి వద్ద తొమ్మిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఒరిస్సా కు చెందిన దివాకర్ మండల్(22) అనే వ్యక్తి వద్ద 9 కిలాల గంజాయితో పాటు బైకును సీజ్ చేశారు.
బైక్ వెనక వస్తున్నటువంటి హుందాయి కార్ పై అనుమానం వచ్చి ఎక్సైజ్ టీములు తనిఖీలు నిర్వహించగా కారులో 100 కేజీల గంజాయి లభ్యమైంది.
ఈ కేసులో ఎలక్ట్రిషన్ గా పనిచేసే అటువంటి ఒరిస్సాకు చెందిన సుమన్ పాల్ (22)
అదుపులోకి తీసుకున్నారు.
కారు బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను విచారించగా మరో లారీలో కూడా గంజాయి ఉన్నట్లు నిందితులు ఇచ్చిన సమాచారం..
కరుణ కరుణగిరి వద్ద ఆగి ఉన్నటువంటి లారీని తనిఖీలు చేయగా 263.2 కేజీల గంజాయి పట్టుబడింది.
లారీ లో ఉన్న రాజశేఖర్ మార్గి (22), లారీ లో ఉన్న క్లీనర్ బ్రిజన్ నాసా(20) ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరు కూడా ఒరిస్సాకు చెందిన వ్యక్తులుగానే గుర్తించారు లారీ కూడా ఒరిస్సా ప్రాంతానికి చెందినదిగా ఉంది.
కొత్తగూడెం డిటిహెచ్ సిఐ రమాదేవి మరో సిఐ కిష్టయ్య, నరేందర్ రెడ్డి తో పాటు ఎస్ఐ సలీముల్లా ఖాన్ శ్రీధర్ రావులతో కలిపి సిబ్బంది
కరీం, మౌలాంకర్, వీరబాబు, శ్రీనివాస్, నర్సింహరావు, రమేష్, పార్థసారధి, విల్సన్, సీతారాం, వీరభద్రం, రాకేష్, కిరణ్, ప్రసన్న కుమార్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.
గంజాయిని పట్టుకున్నటువంటి ఖమ్మం టీంలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ అంజన్ రావు,ఖమ్మం డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అభినందించారు.