### **సైడ్ కాలువల్లో మట్టి.. రోడ్డుపై వర్షపు నీరు**
**తుమ్మలచెరువు గ్రామస్తుల ఇబ్బందులు – అధికారుల చర్యలకు విజ్ఞప్తి**
**తర్లుపాడు:** మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో తర్లుపాడు–కల్లులపాడు రహదారి మధ్యలో సైడ్ కాలువలను మట్టితో పూడ్చివేయడంతో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రహదారిపై రాకపోకలు సాగించే ప్రజలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
సమస్యపై ఇప్పటికే మండల అధికారులకు వినతిపత్రం సమర్పించినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం విచారకరమని గ్రామస్తులు పేర్కొన్నారు. వర్షపు నీరు సక్రమంగా వెళ్లేలా సైడ్ కాలువల్లో వేసిన మట్టిని తొలగించి, రహదారిపై నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.