Public App Logo
Profile Picture

మన ప్రకాశంజిల్లా వార్తలు

@usr00403898
41Followers
0Following
📢 **రిఫామ్ ఉత్సవ్‌పై మంత్రి ఫారూఖ్‌తో ఏపీఎస్‌ఎంఎఫ్‌సీ డైరెక్టర్ల చర్చ**

**మార్కాపురం, అక్టోబర్ 2:** నంద్యాల క్యాంప్ కార్యాలయంలో మైనార్టీల సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి **ఎన్.ఎం.డి. ఫారూఖ్**‌ను ఏపీఎస్‌ఎంఎఫ్‌సీ డైరెక్టర్లు **సయ్యద్ సాదిక్, మనియార్ ఖలీల్** మర్యాదపూర్వకంగా కలిశారు.

🔹 అక్టోబర్ 8న విజయవాడలో నిర్వహించనున్న **NMDFC “రిఫామ్ ఉత్సవ్” అవుట్‌రీచ్ కార్యక్రమం**పై మంత్రితో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ, ఆర్థిక సహాయ పథకాలపై అర్హులకు అవగాహన కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు.

🔹 అనంతరం **మార్కాపురం షాదీఖానా నిర్మాణం**, **ఉర్దూ అకాడమీ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు** అంశాలను డైరెక్టర్ సయ్యద్ సాదిక్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

🔹 దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ **షాదీఖానా పనులను త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఉర్దూ అకాడమీ కంప్యూటర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని** హామీ ఇచ్చారు.
మార్కాపురం జిల్లా కేంద్రం లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ యం విజయసునీత, జెసి పులి శ్రీనివాసులు
మార్కాపురం మండలం భూపతిపల్లి గ్రామం లో పల్లె పండుగ, పేదల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గారు, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఇతర జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది. ఈ సందర్భంగా సీసీ రోడ్డు, గోకులం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాల్లో కలెక్టర్, ఎమ్మెల్యే  పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన పెన్షన్ లు, గర్భిణీ లకు పౌష్టికాహారం అందజేయడం తో పాటు గ్రామంలో పీహెచ్ సీ భవనానికి 10 సెంట్ల స్థలం ఇచ్చిన కుందూరు శివకుమారి, శ్రీనివాసరెడ్డి దంపతులను ప్రత్యేకంగా అభినందించారు.
మార్కాపురం నూతన డిఎస్పీగా నిమ్మగడ్డ సత్యనారాయణ నియామకం.
Video 4
Video 5
ఆర్మీ హవల్దార్‌కు కలెక్టర్ ఘన నివాళులు. బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ హవల్దార్ కువ్వారపు కిషన్ అస్సాంలో ఈ నెల 27న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, ఆర్మీ, పోలీస్ అధికారులు పాల్గొని నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వపరంగా అండగా ఉంటామన్నారు
Video 7
Video 8
Video 9
Video 10
*మార్కాపురం జిల్లా డీఆర్వోగా ఎం. శ్రీదేవి*

- మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) ఎం. శ్రీదేవిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

- ప్రస్తుతం ఏలూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్, డీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఎం. శ్రీదేవిని మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చారు. 

- తనకు మంజూరైన ఎర్న్డ్ లీవ్ పూర్తయిన అనంతరం కొత్తగా కేటాయించిన పదవిలో చేరాలని శ్రీదేవిని ప్రభుత్వం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్ ఉత్తర్వులో పేర్కొన్నారు. 

- అయితే డీఆర్వో ఎం. శ్రీదేవి గతంలో గిద్దలూరు, కొమరోలు మండలాల తహసీల్దార్ కూడా విధులు నిర్వహించారు.

- సంబంధిత అధికారులు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని, ఆమె రిలీవ్‌, జాయినింగ్ తేదీలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
*మార్కాపురానికి 400 మంది పోలీసు సిబ్బంది*

మార్కాపురం జిల్లా ఏర్పడి తొమ్మిది నెలల అనంతరం ప్రత్యేక ఎస్పీ నియామకంతో జిల్లా పోలీసు వ్యవస్థ బలోపేతం కానుంది. పోలవరం ఓఎస్డీగా పనిచేసిన పంకజ్‌కుమార్ మీనా గురువారం మార్కాపురం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి సుమారు 400 నుంచి 450 మంది పోలీసు సిబ్బందిని మార్కాపురం జిల్లాకు కేటాయించే అవకాశం ఉంది. స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్‌బీ, మహిళా పోలీసు, ఇంటెలిజెన్స్, సీసీఎస్, ఐటీ కోర్, ట్రాఫిక్ విభాగాలు ఏర్పాటు కానున్నాయి. టౌన్, రూరల్ పోలీస్‌స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. మహిళా, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లతో పాటు సీసీఎస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు.
మట్టి కిందే మహా చరిత్ర.. చందవరాన్ని వీడని గ్రహణం.. చారిత్రక సంపదపై నిర్లక్ష్యపు నీడలు-
పామూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా

స్టేషన్‌లోని రికార్డులు, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతిపై ఆరా

పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి ఎస్పీ ఆదేశాలు

శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచన

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశం

చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచన

స్థానిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశం

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై నమ్మకం పెరిగేలా మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సూచన
వెలుగులు కరువు.. అంధకారంలో మార్కాపురం బస్టాండ్

బస్టాండ్‌లో చీకటి రాజ్యం.. ప్రయాణికుల అవస్థలు

మార్కాపురం బస్టాండ్‌లో వెలుగుల కొరత.. భద్రతపై ఆందోళన
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం లో పాల్గొన్న కూటమి నాయకులు మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి, మంత్రి గొట్టిపాటి రవి ఎమ్మెల్యే లు
<nis:link nis:type=tag nis:id=## nis:value=## nis:enabled=true nis:link/> **సైడ్ కాలువల్లో మట్టి.. రోడ్డుపై వర్షపు నీరు**

**తుమ్మలచెరువు గ్రామస్తుల ఇబ్బందులు – అధికారుల చర్యలకు విజ్ఞప్తి**

**తర్లుపాడు:** మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో తర్లుపాడు–కల్లులపాడు రహదారి మధ్యలో సైడ్ కాలువలను మట్టితో పూడ్చివేయడంతో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రహదారిపై రాకపోకలు సాగించే ప్రజలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

సమస్యపై ఇప్పటికే మండల అధికారులకు వినతిపత్రం సమర్పించినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం విచారకరమని గ్రామస్తులు పేర్కొన్నారు. వర్షపు నీరు సక్రమంగా వెళ్లేలా సైడ్ కాలువల్లో వేసిన మట్టిని తొలగించి, రహదారిపై నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
Video 18
చంద్రబాబు ప్రభుత్వంపై తిరగబడిన సచివాలయ ఉద్యోగులు..!🚨

పోలీసుల దిగ్బంధనంలో విజయవాడ ధర్నా చౌక్. ధర్నా చౌక్‌కి ఉద్యోగులు రాకుండా అన్ని వైపులా బారికేడ్లతో మూసేసిన పోలీసులు

ఎక్కడికక్కడ సచివాలయ ఉద్యోగులను అరెస్ట్. కానీ పోలీసుల వలయాన్ని ఛేదించి లెనిన్ సెంటర్ వరకు వేలాదిగా తరలివచ్చిన సచివాలయ ఉద్యోగులు

లెనిన్ సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించిన సచివాలయ ఉద్యోగులు

<nis:link nis:type=tag nis:id=sadistchandrababu nis:value=SadistChandraBabu nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=cbnfailedcm nis:value=CBNFailedCM nis:enabled=true nis:link/>
ఒంటరి వృద్ధు రాలికి మత్తుమందు ఇచ్చి బంగారంగాజులు చోరీ చేసినా తల్లీ కొడుకులు
Video 21
Video 22
రంగాపురం నుండి అర్ధవీడు వరకు నూతన రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతూ .మేము అర్ధవీడు మండలం, మార్కాపురం జిల్లా పరిధిలోని బస్సిరెడ్డిపల్లె, పోతురాజుటూరు, యాచావరం, రంగాపురం, గన్నేపల్లె, బొమ్మిలింగం, వెలగలాపాయ గ్రామాల ప్రజలము. మా గ్రామాల ప్రజలు కంభం (Cumbum) మరియు పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రస్తుతం సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వృద్ధులు మరియు అత్యవసర వైద్య సేవలు అవసరమైన ప్రజలు రవాణా సమస్యలను ఎదుర్కొంటున్నారు. .రంగాపురం నుండి అర్ధవీడు వరకు నూతన రహదారి నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించి, రోడ్డు మంజూరు చేసి, వీలైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించవలసిందిగా ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుతున్నాము. ఈ రహదారి నిర్మాణం ద్వారా పై గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిగి, విద్య, వైద్యం, వ్యవసాయం మరియు రోజువారీ అవసరాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

Right App
ప్రకాశం జిల్లా

సింగరాయకొండలో జాతీయ రహదారి-16పై ఘోర రోడ్డు ప్రమాదం

గోల్డెన్ కేఫ్ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన కారు

తిరుపతి నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం.. కారులో ఇద్దరు మృతి

మృతులు హరిప్రసాద్, నర్మదాగా గుర్తింపు

ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. ప్రమాద కారణాల పై పోలీసులు దర్యాప్తు
మన ప్రకాశంజిల్లా వార్తలు (@usr00403898) | Public App