*మార్కాపురానికి 400 మంది పోలీసు సిబ్బంది*
మార్కాపురం జిల్లా ఏర్పడి తొమ్మిది నెలల అనంతరం ప్రత్యేక ఎస్పీ నియామకంతో జిల్లా పోలీసు వ్యవస్థ బలోపేతం కానుంది. పోలవరం ఓఎస్డీగా పనిచేసిన పంకజ్‌కుమార్ మీనా గురువారం మార్కాపురం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి సుమారు 400 నుంచి 450 మంది పోలీసు సిబ్బందిని మార్కాపురం జిల్లాకు కేటాయించే అవకాశం ఉంది. స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ, మహిళా పోలీసు, ఇంటెలిజెన్స్, సీసీఎస్, ఐటీ కోర్, ట్రాఫిక్ విభాగాలు ఏర్పాటు కానున్నాయి. టౌన్, రూరల్ పోలీస్స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. మహిళా, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లతో పాటు సీసీఎస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు.