*రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి*
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలోని అమరావతి కడప రాష్ట్రీయ రహదారిపై డోజర్ ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు ఎర్రగొండపాలెం మండలం పెద్దగుడిపాడు గ్రామానికి చెందిన లక్ష్మణరావుగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వ్యక్తిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.