మార్కాపురం: హవల్దార్ కు ఘన నివాళులు అర్పించిన కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన కువ్వారపు కిషన్ ఆర్మీలో హవల్దార్ గా విధులు నిర్వహిస్తూ అస్సాం రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ నెల 27 వ తేదిన మరణించారు. ఈ నేపథ్యంలో స్వగ్రామం లో కిషన్ పార్దివ దేహానికి బుధవారం ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంతక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గారు, జిల్లా ఎస్పీ ఫంకజ్ కుమార్ మీనా, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, ఆర్మీ, పోలీస్ అధికారులు అంతక్రియల్లో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.