రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీ వద్ద వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో డీఎస్సీ లో జరిగిన అక్రమాలపై న్యాయం చేయాలని రిలే నిరాహార దీక్షలు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఎస్కే యూనివర్సిటీ వద్ద గురువారం 11:30 నుంచి సాయంకాలం నాలుగున్నర వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నుపూసల రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీఎస్సీ 2005 నియమకాల్లో జరిగిన అక్రమాలపై పోరాటాలు చేసేందుకు మరింత ఉద్ధృతం చేయాలని బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని అందులో భాగంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభం చేయడం జరిగిందని రాప్తాడు వైసీపీ నేత రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.