రాయదుర్గం: మంత్రి, విప్ ఉన్నా మారని హొసళ్ళి - మల్లాపురం ప్రధాన రహదారి దుస్థితి, చందాలతో రోడ్డు రిపేరి చేపట్టిన విద్యార్థులు
రోడ్డు గుంతల మయంగా మారింది, కనీసం ద్విచక్ర వాహనాలు వెళ్లాలంటే కూడా ఇబ్బంది గా ఉంది దయచేసి రోడ్డు వేయండి. రోడ్డు కు ఇరువైపులా కంపచెట్లు తొలగించండి మహాప్రభో అంటూ అధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. వారినుండి కనీస స్పందన లేకపోవడంతో ఆ మార్గంలో కాలేజీలకు వెళ్లే విద్యార్థులే చందాలు వేసుకుని కంపచెట్లు తొలగింపు గుంతలకు మట్టి వేసే పనులు చేపట్టారు. ఈ సంఘటన బొమ్మనహాల్ మండలంలోని హొసళ్ళి నుంచి మల్లాపురం రహదారిలో మంగళవారం కనిపించింది. అటు ఉరవకొండ నియోజకవర్గం మంత్రి పయ్యావుల, ఇటు రాయదుర్గం నియోజకవర్గం ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు ఉన్నప్పటికీ రోడ్డు దుస్థితి మారలేదన్నారు.