రాయదుర్గం: రంగచేడులో "ఇంటింటికీ తెలుగుదేశం" లో పాల్గొన్న టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు
గుమ్మఘట్ట మండలం రంగచేడు పంచాయితీలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు, RTC జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.