రాయదుర్గం: అకడమిక్ ఇన్ట్రక్టర్ పోస్టులకు ధరఖాస్తుల ఆహ్వానం
రాయదుర్గం మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేందుకు తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్ ఇన్ట్రక్టర్ ల పేరుతో ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎంఈవో ఇర్షాద్ తెలిపారు. పట్టణం, మండలంతో కలిపి 47 ఎస్జీటీ, 42 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మెత్తం 89 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఎస్జీటీ కి టిటిసి, ఎస్ఏ కు బిఈడి చేసిన వారు అర్హులన్నారు. ఈనెల 19 న అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అన్నారు.