మార్కాపురం: పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి బీవీ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వివిధ పాటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కరిమున్ బీబీ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.