రాయదుర్గం: వేపరాళ్ల వద్ద కారులో మంటలు చెలరేగి దగ్ధం, తప్పిన ప్రాణాపాయం
రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామశివారులో కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. తృటిలో ప్రాణాపాయం తప్పింది. కారులో కళ్యాణదుర్గం ఆసుపత్రికి వేపరాళ్ల గ్రామానికి చెందిన మహిళను తీసుకెళ్లి తిరిగి వచ్చిన డ్రైవర్, ఓ హోటల్ వద్ద కారు ఆపగా ఇంజన్ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే మంటలు అంటుకున్నాయి. నీరు పోసి ఆర్పేందుకు ప్రయత్నించగా టైర్లు, బ్యాటరీ పేలి జనం భయపడ్డారు. సాంకేతిక సమస్యవల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.