మార్కాపురం: జిల్లా కేంద్రంలో హార్టికల్చర్ హబ్ పై స్థానికులను ఆకట్టుకున్న భారీ డ్రోన్ షో
మార్కాపురం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల ప్రాంగణంలో భారీ డ్రోన్ షో నిర్వహించారు. రాయలసీమ ప్రకాశం మార్కాపురం ప్రాంతాలను అత్యంత కీలకమైన గ్లోబల్ ఉద్యాన హాబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రాజెక్టు గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. డ్రోన్ షో రంగురంగుల దృశ్యరూపాలతో కండ్లకు కట్టినట్టుగా ప్రదర్శించారు.