సంతనూతలపాడు: మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరులో పర్యటించిన ఐసిడిఎస్ పిడి సునంద
మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరులో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ సునంద మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు చిరుధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.