గార్ల: గార్ల ఆశ్రమ బాలికల హాస్టల్లో ఎంపీడీవో ఆకస్మిక తనిఖీ
గార్ల మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల వసతి గృహాన్ని ఎంపీడీవో మంగమ్మ తనిఖీ చేశారు. భోజన నాణ్యత, వసతులు, పరిశుభ్రతను పరిశీలించి, విద్యార్థినులతో కలిసి భోజనం చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డెన్‌ను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.