రాప్తాడు: రామగిరి మోడల్ పాఠశాలలో హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో విద్యార్థినిలతో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్య సాయి జిల్లా రామగిరి మండలం కేంద్రంలో కస్తూర్బా మోడల్ పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు హర్ ఘర్ తిరగ్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి విద్యార్థినిలతో కలిసి మొక్కలు నాటి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో కృషిచేసిన మహనీయుల్ని స్మరించుకోవడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కస్తూరిబా పాఠశాల, మోడల్ పాఠశాల విద్యార్థినిలు అధ్యాపకులు పాల్గొన్నారు.