రాయదుర్గం: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై ఎమ్మెల్యే అసంతృప్తి, మెరుగుపడాలని వైద్యులకు ఆదేశాలు
రాయదుర్గం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో వైద్య సేవలపై సమీక్షించారు. ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ ల సంఖ్య ఎందుకు తగ్గుతోందని వైద్యులను ప్రశ్నించారు. ఆపరేషన్ లు జరగడం లేదని ఎక్కవగా బళ్ళారి, అనంతపురం కు రెఫర్ రాస్తున్నారని, కాన్పుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని ఇది మారాలని వైద్యులను ఆదేశించారు. వైద్య సౌకర్యాలు మెరుగుపడాలని, మైనర్ ఆపరేషన్ లు ఇక్కడే జరగాలని ఆదేశించారు.