రాయదుర్గం: పట్టణంలోని లక్ష్మీబజార్ వద్ద డివైడర్ ను ఢీకొట్టిన ఆర్టీసి బస్సు
రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీబజార్ కణేకల్లు రోడ్డు మలుపు వద్ద గురువారం RTC బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. బస్సు మధ్య భాగం డివైడర్‌కు తగిలి అక్కడే ఇరుక్కుపోయింది. బస్సును బయటకు తీసేందుకు డ్రైవర్ తీవ్రంగా శ్రమించారు. బస్సు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో సుమారు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. మలుపు వద్ద రోడ్డు పక్కన వాహనాల పార్కింగ్, సరైన పద్ధతిలో డివైడర్లు అమర్చకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.