రాయదుర్గం: ఎడారి నివారణకు రూ.150 కోట్లు ఇవ్వండి: ఎమ్మెల్యే
రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో ఎడారి నివారణకు రూ.150 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను MLA కాలవ శ్రీనివాసులు కోరారు. దక్షిణ భారతంలోనే రాయదుర్గంలో ఎడారి వేగంగా విస్తరిస్తోందని, మాల్యం నుంచి దర్గా హొన్నూరు వరకు 20 వేల ఎకరాల్లో ఇసుక దిబ్బలున్నాయని వివరించారు. ఉపాధి హామీ కింద 3 ఏళ్లలో నిధులు ఇస్తే ఎడారి నివారణ సాధ్యమని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.