రాయదుర్గం: రాయదుర్గంలో రైతు బజార్ ఏర్పాటుకు జేసీ పరిశీలన
ప్రతీ నియోజకవర్గంలో ఒక రైతు బజార్ ఉండాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాయదుర్గంలో రైతు బజార్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరెడ్డి వెల్లడించారు. గురువారం రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ రైతు బజార్ ఏర్పాటైతే పట్టణంలోని శాంతినగర్ లో ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుందని స్పష్టం చేశారు. జెసి భూ పరిశీలన చేశారని, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన రైతు బజార్ త్వరలో నిర్మాణం సాకారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.