రాప్తాడు: రామగిరిలో ఎల్ నినో ప్రభావం వల్ల రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినిత పత్రం ఇచ్చారు
సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో సోమవారం నాలుగు గంటల 15 నిమిషాల సమయం లో రామగిరి కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేశవ ఆధ్వర్యంలోఎల్ నినో ప్రభావం వల్ల రైతులను ఆదుకోవాలని ఎంపీడీవోకు ఎమ్మార్వో కు వినిత పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా యనుముల ప్రసాద్ ఆంజనేయులు మాట్లాడుతూ రామగిరి మండలం లో ఎల్ నినో ప్రభావం వల్ల రైతులు నష్టపోతున్నారని అందుకు రైతుల ఆదుకోవాలని రైతులకు ఉపాధి హామీ పథకం వర్తింపజేసి వెయ్యి రూపాయలు కూలి ఇవ్వాలని 150 రోజులు పని దినాలు కల్పించాలని ఈ సమస్యలని పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం ఇచ్చామని అనంతపురం రూరల్ కాంగ్రెస్ పార్టీ అర్బన్ కన్వీనర్ ప్రసాద్, ఆంజనేయులు తెలిపారు.