సంతనూతలపాడు: మద్దిపాడు హైవేపై రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే మృతి చెందిన బాలుడు
మద్దిపాడు: రోడ్డు ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం త్రోవగుంట టయోటా షోరూం వద్ద సోమవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్దిపాడు హైవేపై గుంటూరు వైపు వెళ్తున్న ర్యాలీ ఆటోను వెనుక నుండి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరేళ్ల బాలుడు సీమా రోడ్డుపై పడిపోవడంతో లారీ బాలుడు తలపై నుంచి వెళ్ళిపోయింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడగా, మరో ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి.