రాయదుర్గం: బొగ్గుల బట్టిల్లో వెట్టి చాకిరీ, REDS ద్వారా బొమ్మనహాల్, డి.హిరేహాల్ మండలంలోని 93 మందికి విముక్తి
రాయదుర్గం నియోజకవర్గంలో మహారాష్ట్ర వలస కూలీలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం REDS స్వచ్చంద సంస్థ సహకారంతో రెవెన్యూ, లేబర్, పోలీసు శాఖలు బొమ్మనహల్, డి.హీరేహల్ మండలాల్లో పలు ప్రాంతాల్లో బొగ్గులు కాల్చే పనిలో ఉన్న సుమారు 93 మందిని రెస్క్యూ చేశాయి. వీరిలో గర్భిణీలు, చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నారు. వారిని రాయదుర్గం తరలించారు. పూర్తి వివరాలు అధికారులు ప్రకటించాల్సి ఉంది.