రాయదుర్గం: ఎన్ఎంఎంఎస్ పలితాల్లో సత్తా చాటిన ఏపి మోడల్ పాఠశాల విద్యార్దులు
రాయదుర్గం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. మంగళవారం పరీక్ష పలితాలు విడుదలయ్యాయి. ఎనిమిదో తరగతికి చెందిన 70 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 13 మంది అర్హత సాధించారు. అర్హత పొందిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేల స్కాలర్షిప్ అందిస్తుందని ప్రిన్సిపాల్ రంజిత్ కుమార్ తెలిపారు. విద్యార్దులను ప్రిన్సిపల్ తో పాటు పలువురు అధ్యాపకులు అభినందించారు.