సంతనూతలపాడు: చీమకుర్తి: శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో హుండీ చోరీ, రూ. 10 వేలు మాయం
చీమకుర్తి మండలం ఏలూరు వారి పాలెంలో దొంగలు పడ్డారు. శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయ తాళాలు పగలగొట్టి, హుండీలోని రూ. 10 వేల నగదును దోచుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి ఈ చోరీ జరిగిందని అర్చకులు తెలిపారు.