మార్కాపురం: పొదిలి వైసిపి కార్యాలయంలో నాయకులు కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం
పొదిలి పట్టణంలోని వైయస్సార్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకుల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నాయకులు కార్యకర్తలు పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.