రాప్తాడు: తపోవనం వద్ద ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారి దిగ్బంధన అడ్డుకున్న పోలీసులు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని తప్పు వనం వద్ద సోమవారం 10:45 నిమిషాల సమయంలో సిఐటియు ఎఐటిసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 44 జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాగేంద్ర ఏఐటిసి రాజారెడ్డి రైతు సంఘం మల్లికార్జున మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రైతు కార్మిక సమస్యలు పరిష్కరించాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్ని వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 44 జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమాన్ని చేయడం జరిగిందని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు.