రాయదుర్గం: మాల్యం - కళేకుర్తి గ్రామాల మద్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం
కణేకల్లు మండలంలోని మాల్యం - కళేకుర్తి గ్రామాల మద్య ఆటో బోల్తా పడిన ఘటనలో సల్మాన్ (28) అనే ఆటో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల వివరాలమేరకు కుందుర్తి మండలం బొచ్చుపల్లి గ్రామానికి చెందిన ఆతను వరి నారు చూసేందుకు బుధవారం ఆటోలో వచ్చి వచ్చి తిరిగి వెళుతుండగా మలుపు వద్ద ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.